2.ఇంగ్లీషు వత్సరము ఇంపుగా ఉదయించె
షణ్ముఖ ప్రియ రాగము త్రిస్ర ఏక తాళము
పల్లవి....ఇంగ్లీషు వత్సరము ఇంపుగా ఉదయించె
ఆంగ్లేయ భాషయే అచ్చ తెనుగాయె
1. సంస్కృతి అంతయు సందుల పాలాయె
సంస్కృతము జర్మనీ స్వంతమాయె
సంస్కారమంతయు సన్నగిల్లిపోయె
సంస్కరించెడి వారు లేకనేపోయె
2. సంగీత సాధన సన్నబడిపోయె
యోగ సాధన పెద్ద వ్యాపారమాయె
భోగ లాలసుల బలమెంతొ పెరిగె
రాగ ద్వేషమ్ములు పెచ్చుపెరిగె
3. దైవ చింతన యెంతొ దయనీయమాయె
దైవారాధన ఆనవాయితి ఆయె
దేవాలయమ్ములు డబ్బు కొరకాయె
దేవాదాయము స్వంత ఖర్చులకాయె
రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం (smkoav@gmail.com)
షణ్ముఖ ప్రియ రాగము త్రిస్ర ఏక తాళము
పల్లవి....ఇంగ్లీషు వత్సరము ఇంపుగా ఉదయించె
ఆంగ్లేయ భాషయే అచ్చ తెనుగాయె
1. సంస్కృతి అంతయు సందుల పాలాయె
సంస్కృతము జర్మనీ స్వంతమాయె
సంస్కారమంతయు సన్నగిల్లిపోయె
సంస్కరించెడి వారు లేకనేపోయె
2. సంగీత సాధన సన్నబడిపోయె
యోగ సాధన పెద్ద వ్యాపారమాయె
భోగ లాలసుల బలమెంతొ పెరిగె
రాగ ద్వేషమ్ములు పెచ్చుపెరిగె
3. దైవ చింతన యెంతొ దయనీయమాయె
దైవారాధన ఆనవాయితి ఆయె
దేవాలయమ్ములు డబ్బు కొరకాయె
దేవాదాయము స్వంత ఖర్చులకాయె
రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం (smkoav@gmail.com)
తొమ్మిది సంఖ్య గొప్పదనం
సంఖ్యా శాస్త్రంలో తొమ్మిది అంకెను బ్రహ్మ సంఖ్య అంటారు. దైవ సంఖ్య, పురాణ సంఖ్య అని కూడా అంటారు. ఏదైనా సంఖ్యను తీసుకొని ఆ సంఖ్యను తొమ్మిదిచే గుణించి ఫలితాన్ని యేక సంఖ్య చేసిన తొమ్మిది అవుతుంది. 12345 ని తొమ్మిదితో గుణిస్తే 111105 వస్తుంది. ఈ అంకెలన్నీ కలిపిననూ తొమ్మిదే వస్తుంది. మానవ శరీరంలో 72000 నాడులు వున్నాయి. ఎంత పెద్ద లేక చిన్నమొత్తమైనా తొమ్మిదేవస్తుంది. తొమ్మిదవ యెక్కము చూసినచో విషయము తెలియును.
కృతయుగం సంవత్సరాలు 17,28,000.త్రేతా యుగం 12,96,000 ద్వాపర యుగం 8,64,000. ఏ అంకెలను కలిపినా తొమ్మిదే వస్తుంది. వున్నవి 9 అంకెలే. ఒకటి నుండి 9 వరకు. మహా భారతంలో పర్వాలు 18, యుద్ధ దినాలు 18, సైన్యం 18 ఆక్షౌహిణులు 18, భగవద్గీత అధ్యాయాలు 18. వ్యాసుడు వ్రాసిన పురాణాలు 18. 1+8 కలిపితే 9. ఒకటి నుండి తొమ్మిది వరకు మొత్తాన్ని కలిపితే 9. మనిషి శరీరం నవద్వారపురి. గంటకు సెకెండ్లు 3600, రోజుకు 1440 నిముషాలు. నెలకు 720 గంటలు, సంవత్స రానికి 360 రోజులు, 60 సంవరాలకు 720 నెలలు.60 సంవత్సరాలకు 21600 రోజులు. ఏది కలిపినా 9 అవుతుంది. తొమ్మిదిని మృత్యంజయసంఖ్యగా భావిస్తారు. బిడ్డ గర్భములో 270 రోజులునుటుంది. దేన్ని కలిపినా తొమ్మిదే. ఈ విధంగా 9 ని గొప్పదిగా భావిస్తారు. చైనీయులకు 4 చెడ్డ సంఖ్య. 8 సిరి సంఖ్య.
సేకరణ: కొడవంటి సుబ్రహ్మణ్యం
==================================
ప. మాతరం వందేమాతరం మనదేభారతం
తరం తరం అంతరం అంటరానితనమెందుకు
1.కులము మతములెన్నో కలవు
కలసి వుంటె హాయి కలదు
కలహించుట యెందులకు
వలదు మనము హితులము
2.మహాత్ముని వారసులం
మహా శాంతవంతులం
ఈశ్వర అల్లా ఒకటే
భగవానుని మతమొకటే
3.విశ్వమంత ఒకే కులం
విశ్వమంత ఒకే మతం
విశ్వశాంతి మన ధ్యేయం
విశ్వసించి సాగుదాం
రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం smkodav@gmail.com
==============================
ఒక నూత్న వత్సరము
ప. వస్తూనె వున్నాది వెళుతూనె వున్నాది
ఒక నూత్న
వత్సరము ప్రతి వత్సరమ్ము
1. తెస్తూనె
వున్నాది తనతోటి యెల్లపుడు
విస్తుపోయెడి వింత వింతలనెన్నిటినొ
మస్తుగా మనసునే రంజిల్ల
జేయునవి
హస్తినాపురమున అలజడులు
రేపునవి
2. జనసంఖ్యనెటులైన
నియంత్రించుటకు
ఆశావాదులను ఆనంద
పరచుటకు
గాంధేయ వాదుల మాట
చెల్లించుటకు
తంటాలు పడుచు తమాషా
చూచుటకు
3.
అన్నమో
రామంచు అలమటిస్తూ వుంటె
భారతావనినున్న
ధనరాసులను యెన్నో
పరాయి పంచను చేరవేయుటకు
తిరిగి రాబట్టుటకు
తికమక పెట్టుటకు
4.
మంచినే
పెంచుచు మనమందరము వుంటె
వంచనయె మన పంచ
చేరకుండగనుంటె
లోక కళ్యాణమే కనువిందు
చేస్తుంటె
మహదానందమే మనకు అందరకు
No comments:
Post a Comment