పల్లవి.. వచ్చింది వచ్చింది ఒక నూత్న వత్సరము
తెచ్చింది తెచ్చింది తృప్తి లేని బ్రతుకు
1. అచ్చు గుద్దినట్లు అయిదు వందల నోట్లు
ముచ్చెమటలు పట్టు ముష్కరుల చేష్టలు
పచ్చని నోటుకు పరపతి పడిపోయే
నచ్చని బ్రతుకాయే నడి జీతగానికి
2. విత్త మంత్రి బ్రతుకు వింతగా మారెను
విత్తమునకు విలువ లేకనే పోయే
కత్తి మీద సాము కాలమే మారెను
జిత్తుల మారిదే జీవితమ్మాయే
3. మత్తు పానీయాలు మహరాజు బ్రతుకాయే
చిత్తుగా త్రాగి చిందులే వేయుచు
చిత్త కార్తి లోని గ్రామసింహాలాయె
ఉత్తుత్తి డంబమే వూరూర పాకె
రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం
No comments:
Post a Comment